రాముడు ని మనం దేవుడి లాగా కొలుస్తున్నాం.
ఆయన పుట్టేటప్పుడు దేవుడు కాదు. అడవికి వెళ్ళేటప్పుడు దేవుడు కాదు. రావణున్ని
చంపినపుడు దేవుడు కాదు. మరెవరు? రాజ్యానికి రాజు. మన పురాణాల్లో తనని రాజుగానే
రాసారు. మరి దేవుడు ఎలా అయ్యాడు??
గౌతమ బుద్ధుడు. పుట్టినప్పుడు హిందువు.
కాని తన సూత్రాలతో ఒక కొత్త మతాన్నే సృష్టించి హిందూమతానికే సమానంగా నిలిపాడు.
(తరువాతి రోజుల్లో ఆదిశంకరాచార్యుడు హిందూమత ధర్మాన్ని పునరుద్ధరించాడు). అటువంటి గౌతమ
బుద్ధుడు ఏనాడు తనని దేవునిగా చెప్పుకోలేదు. తనకి ఉన్నది శిష్యులు మాత్రమే. కాని ఇప్పుడు
ఆయన స్థానం ఏమిటో అందరికి తెలుసు.
ఏసుక్రీస్తు మనిషి. ప్రజలందరి ముందు తనని
శిలువ వేసారు. తనని రక్షించుకోలేని వాడు ప్రపంచాన్ని ఎలారక్షిస్తాడు అని ఎవరూ
ఆలోచించలేదు. అతను జనం కోసం శిలువకు సిద్ధపడ్డాడు. దాని వల్ల అతను దేవుడయ్యాడు.
ఇలా చూస్తే మహమ్మద్, సాయిబాబా...
వీళ్ళందరూ పుట్టేటప్పుడు కానీ చనిపోయేటప్పుడు కానీ దేవుళ్ళు కాదు. కేవలం మనుషులకు
మంచి దారి చూపటం వల్ల, సేవ చేయటం వల్ల ఆ తరువాతి కాలంలో దేవుడిగా చూస్తున్నారు.
ఒకే ఒక్కరికి సాయం చేసి దేవుడివైపో
ఎలాగంటారా.... ఈ చిన్న లెక్కను చూద్దాం
నువ్వు నీకు అప్పటి వరకు కనీసం పరిచయం
లేని ఒకరికి సాయం చేసావు. అదీ ఎటువంటి సాయం అంటే తన నీ ప్రాణాలని పణంగా పెట్టి తన
కుటుంబాన్ని మొత్తం కాపాడినటువంటి సాయం. నువ్వు వారినుండి ఏమి ఆశించకుండా
ఎప్పుడైనా కష్టమొచ్చినపుడు మళ్ళి దగ్గరకు రావటానికి సంకోచించ వద్దు అని చెప్పి
వెళ్ళావ్. వాళ్ళు ఆ రోజు నుండి నీ ఫోటో ఒకటి పెట్టుకుని పూజించటం మొదలుపెట్టారు. అలా
కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుటుంబంలో తర్వాతి తరం వస్తుంది.
మనమడు అడుగుతాడు. తాతా ఎవరూ ఆ ఫోటోలో
ఉంది. ఆయన మన కుటుంబాన్ని కాపాడాడు అంటాడు తాత. అంటే దేవుడే కదా తాతా. అవును
మనవడా... కొన్ని సంవత్సరాల తర్వాత ఆ కుటుంబంలో తర్వాతి తరం వస్తుంది.
ఆ మనమడు ఇప్పుడు తాత. అక్కడి నుండి
నువ్వు వాళ్ళకి దేవుడివి. కుటుంబంలో ఎంతమంది ఉంటారో అందరూ పూజించటం మొదలు పెడతారు.
మనవాళ్ళకి కొత్తగా వచ్చిన దేవుళ్లంటే చాలా భక్తి. ఆ కుటుంబం లో అందరికి అదృష్టం
బాగుండి అన్ని కలిసి వస్తుంటే మిగతావాళ్ళు ఆరా తీయటం మొదలు పెడతారు. వాళ్ళు ఫలానా
దేవుడిని పూజిస్తున్నారు అందుకే వాళ్ళకి అన్ని కలిసి వస్తున్నాయి అని తెలుస్తుంది.
అంతే ఇక అతి త్వరలో నీ గుళ్ళు వూరంతా, రాష్ట్రమంతా, దేశమంతా వెలుస్తాయి.
ఇదంతా నువ్వు ఏ స్వార్థం లేకుండా ఒకరికి
సాయం చేసినపుడు మాత్రమే. అదే నువ్వు ఎంత ఎక్కువ మందికి ఏ స్వార్థం లేకుండా సాయం
చేస్తావో అంత తొందరగా దేవుడివౌతావు.
No comments:
Post a Comment
మనిషి దేవుడిని చేశాడా దేవుడు మనిషిని చేశాడా...