తెలిసీ తెలియని నిజాలు



ఇక్కడ రాసినవన్నీ నా జీవితంలో జరిగిన సంఘటనల వల్ల, నా చుట్టూ ఉన్న మనుషులు నాతో ప్రవర్తించే తీరు వల్ల వచ్చిన ఆలోచనల తోటి రాసిన వాక్యాలు.

“నిన్ను ఇష్టపడే వాళ్ళని నువ్వు నమ్మకపోతే దాని అర్ధం నువ్వు వాళ్ళని నమ్మట్లేదు అని కాదు. వాళ్ళ ఇష్టాన్ని నమ్మట్లేదు అని.”

“ఇద్దరి మధ్య బంధం పెరగటానికి ముఖ్య కారణం వారి మధ్య ఏ రహస్యాలు లేకపోవటమే. వారి మధ్య ఏ రహస్యాలు లేనపుడు వారిద్దరూ కలిపి ఒకరు అవుతారు.”

“మనిషి ఎంతోమందిని చూస్తాడు. కొంతమందిని ఇష్టపడతాడు. ఒకరినే ప్రేమిస్తాడు. కాని ఎంతమంది చేతైనా ప్రేమింప బడతాడు. ఆ ఒక్కరు దొరకనపుడు తనని ప్రేమించే వాళ్ళందరినీ దూరం చేసుకుంటాడు.”

“నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను నమ్మకపోతే తప్పు నీలో ఉన్నట్లు. ఎందుకంటే నిన్ను నమ్మకపోయినా ఇష్టపడుతున్నావ్ కాబట్టి.”

“నిన్ను ప్రేమించే వాళ్ళకు ఇష్టమైంది చేసేటప్పుడు చెప్పకుండా చేయి. ఇష్టం లేనిది చేసేటపుడు చెప్పి చెయ్యి. ఎందుకంటే చెప్పకుండా ఇష్టం లేనివి ఎన్ని చేస్తున్నారో అనుకుంటారు.”

“నిన్ను ప్రేమించే వాళ్ళతో వారానికి ఒకసారైనా కొంచెం సమయం గడుపు. లేకుంటే నిన్ను ప్రేమించే వాళ్లెవరు ఉండరు. వాళ్ళని నువ్వు కూడా ప్రేమిస్తే కలవటానికి సమయం వెతకొద్దు.”

“నువ్వు ప్రేమించే వాళ్ళతో ఒక్కరోజు గడిపే అవకాశం వస్తే ఏం చేస్తావ్...... నేనైతే ఆ ఒక్క రోజులో మొత్తం జీవితం గడిపేస్తా.”

“ప్రేమించే మనిషిని ఎవరూ దూరం చేసుకోరు. ఒకవేళ దూరం అయితే వారికి తెలిసేది మనిషి విలువ కాదు ప్రేమ విలువ.”

No comments:

Post a Comment

మనిషి దేవుడిని చేశాడా దేవుడు మనిషిని చేశాడా...